Ketan Garg:  నీటి సరఫరా చేసేందుకు చర్యలు

సిరా న్యూస్, అనంతపురం
 నీటి సరఫరా చేసేందుకు చర్యలు
* జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్
విన్సెంట్ ఫెర్రర్ కాలనీకి నీటి సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు త్వరితగతిన తీసుకోవడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. గురువారం అనంతపురం నగరంలోని విన్సెంట్ ఫెర్రర్ కాలనీలో నీటి సరఫరా కావడం లేదని ఇంటింటికి వెళ్లి కర్నూలు మున్సిపల్ కమిషనర్ భార్గవ తేజ, అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్, జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ లు పరిశీలించారు. ఈ సందర్భంగా విన్సెంట్ ఫెర్రర్ కాలనీలో ఇంటింటికి నీరు వస్తుందా లేదా, సమస్య ఏమిటనే స్థితిగతులను జెసి ఆరా తీశారు. కాలనీలో నీరు రావడంలేదని, గురువారంనీరు కొంతమందికి రావడం జరిగిందని కాలనీవాసులు తెలిపారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ మోటార్ల మరమ్మతులు కారణంగా నీరు సరఫరా సరిగా కావడం లేదని, మోటార్ల మరమ్మతులు చేయడం జరుగుతోందన్నారు. నీరు సరైన సమయంలో అందించాలని, నీరు రాని పక్షంలో వారికి నీరు రావనే విషయం సమాచారం అందించాలని స్థానిక టాప్ కనెక్షన్ బాయ్ ని ఆదేశించారు. వారం 10 రోజులపాటు నీటి సమస్య ఉండే అవకాశం ఉందని, త్వరితగతిన సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *