సిరా న్యూస్, ఆదిలాబాద్:
జైనథ్ కస్తూర్బాలో విరిసిన విద్యా కుసుమాలు
+ ఇంటర్ ఫలితాల్లో జైనథ్ కస్తూర్బా విద్యార్థినిల హవా
+ ఇంటర్ సెకండ్ ఇయర్లో 100శాతం ఉత్తీర్ణత
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో కస్తూర్బాలో విద్యార్థినిలు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. ఇంటర్ సెకండ్ ఇయర్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించి ప్రైవేట్‌కు ధీటుగా నిలిచారు. సీఈసీ సెకండ్ ఇయర్లో మొత్తం 24 మందికి గాను 24మంది ఉత్తీర్ణులు కాగా, ఎంపీహెచ్‌డబ్ల్యూ సెకండ్ ఇయర్ 35మందికి గాను 35మంది ఉత్తీర్ణులయ్యారు. సీఈసీ ఫస్ట్ ఇయర్లో 41మందికి గాను 36 మంది ఉత్తీర్ణులు కాగా, ఎంపీహెచ్‌డబ్ల్యూ ఫస్ట్ ఇయర్లో 47మందికి 45మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా 1000 మార్కులకు గాను 951 మార్కులు సాధించిన ఎస్. అంజలి ఎంపీహెచ్‌డబ్ల్యూ సెకండ్ ఇయర్ టాపర్‌గా, 908 మార్కులు సాధించిన కే. స్పూర్తి సీఈసీ సెకండ్ ఇయర్ టాపర్‌గా నిలిచారు. కాగా 500ల మార్కులకు గాను 484 మార్కులు సాధించిన జి. మెఘన ఎంపీహెచ్‌డబ్ల్యూ టాపర్‌గా, 430 మార్కులు సాధించిన ఎస్. స్వప్న సీఈసీ ఫస్ట్ ఇయర్ టాపర్‌గా నిలిచారు. డ్రాపౌట్స్లను నివారించాలనే గొప్ప సంకల్పంతో ప్రభుత్వం ప్రారంభించిన కస్తూర్బా పాఠశాలల్లో చదివి, ఉత్తమ ఫలితాలు సాధించిన నిరుపేద కుటుంబాలకు చెందిన ఈ విద్యార్థులను ప్రిన్సిపల్ వీణా కుమారి అభినందించారు. భవిష్యత్తుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అదిరోహించాలని ఆకాంక్షించారు.