Khanapur CI Saida Rao: నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం : ఖానాపూర్ సీఐ సైదారావు

సిరాన్యూస్‌, ఖానాపూర్ టౌన్
నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం : ఖానాపూర్ సీఐ సైదారావు

నేరాల నియంత్రణనే లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుందని ఖానాపూర్ సీఐ సైదారావు అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో శుక్రవారం ఉన్నత అధికారుల సూచన మేరకు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. టూ వీలర్స్, 50, త్రీ వీలర్స్,2. ఫోర్ వీలర్స్, 2. మొత్తం 54 వెహికల్స్ ని సీజ్ చేయడం జరిగింది. ఫైన్ పెండింగ్లో కట్టలేని వాటిని, పేపర్ సరిగ లేని, నంబర్ ప్లేట్లు సరిగా లేనటువంటి , పెండింగ్ చాలన్స్ ఉన్న వాహ‌నాల‌ను, బండ్లు అతిక్రమించి నడిపినటువంటి సీజ్ చేసిన‌ట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఖానాపూర్ సీఐ సైదారావు మట్లాడుతూ.. ప్రజల రక్షణ గురించి ప్రజలలో భద్రతాభావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం, ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకొనే అవకాశం ఉంటుందని, పట్టణ, గ్రామంలో, కాలనీలో ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు కానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని, గ్రామాల్లో ఎవరైనా అనుమానస్పదంగా తిరుగుతూ వుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని వెంటనే చర్యలు చేపడతాం అన్నారు. కార్య‌క్ర‌మంలో ఎస్సై రాహుల్, ఖానాపూర్ పోలీస్ స్టేషన్ స్టాఫ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *