KHANAPUR SI Limbadri: సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి: ఖానాపూర్‌ ఎస్సై లింబాద్రి

సిరాన్యూస్‌, ఖానాపూర్‌
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి: ఖానాపూర్‌ ఎస్సై లింబాద్రి

ప్రధాన రహదారుల పక్కన వ్యాపార సముదాయాలు నిర్వహించుకునే వారు తమ షాపుల ఎదుట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్సై లింబాద్రి అన్నారు. నిర్మ‌ల్ జిల్లా ఖానాపూర్ పట్టణం లో వ్యాపారస్థులతో ఆయన మాట్లాడారు. ప‌ట్ట‌ణ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి నిర్వహణ బాధ్యత కూడా వ్యాపారులు చూసుకోవాలన్నారు. తప్పనిసరిగా ప్రతి షాపు ఎదుట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఏవైనా అనుకోని సంఘటనలు షాపుల ఎదుట జరిగినా అందులో రికార్డు అవుతాయని పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *