సిరా న్యూస్,మెట్ పల్లి;
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ కేంద్రంలోని దుబ్బవాడలో నివాసముంటున్న లక్ష్మి-రాజుల రెండేళ్ల కుమారుడు శివను దుండగులు బైక్ పై వచ్చి ఎత్తుకెళ్లారు. అప్పటి వరకు అక్క అమ్ములు తో కలిసి శివ పక్కనే ఉన్నాడు. కిరాణా షాప్ కు వెళ్తున్న సమయంలో అక్కను ఏమార్చి దుండగులు కిడ్నాప్ చేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సిసి టీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు.