జూబ్లీహిల్స్ లో కిలాడీ లేడీ అరెస్ట్

సిరా న్యూస్, హైదరాబాద్;
రోడ్డు మీద వెళ్లే వారిని లిఫ్ట్ అడగడం, వాహనంలో ఎక్కిన తర్వాత రేప్ చేసేందుకు ట్రై చేశావు అంటూ ఫిర్యాదు చేస్తా అని బెదిరిస్తూ డబ్బులు గుంజుతున్న మహిళ ను పోలీసులు అదుపులో తీసుకున్నారు.
సదరు మహిళ తాను అడ్వకేట్ అని, తనకు అన్ని సెక్షన్లు తెలుసు అంటూ దబాయింపులు చేసేది. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి కేబీఆర్ పార్క్ దాకా కారులో ఎక్కుతుంది. తరువాత బట్టలు చించుకుని రేప్ కేసు పెడతా అంటూ అల్లరి చేస్తోంది. దీంతో బాధిత డ్రైవర్ పరమానంద..
జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. సెక్షన్ 389 సెక్షన్ కింద కిలేడీ సయీదా నయీమా సుల్తానా(32)ను జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్ట్ చేసారు. కిలాడీ లేడీ మీద నగర వ్యాప్తంగా పలు స్టేషన్లలో 17 కేసులు వున్నట్లు పోలీసులు గుర్తించారు. కిలాడీ లేడీ వద్ద వందలాది కేసులకు సంబంధించిన కేస్ స్టడీస్ వివరాలు లభించాయి. వాటిని అడ్డుపెట్టుకుని ప్రతి కేసులో ఎలాంటి శిక్ష పడుతుంది అని బాధితులను ఆమె బెదిరిస్తుంది. పలువురు అమాయకుల మీద కిలాడీ లేడీ కేసులు పెట్టినట్లు దర్యాప్తులో వెల్లడయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *