సిరాన్యూస్,జైనథ్
రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం : కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు ఏనుగు రాకేష్ రెడ్డి
రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోమని బీజేపీ కిసాన్ మోర్చా జైనథ్ మండల అధ్యక్షులు ఏనుగు రాకేష్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చాలా మంది రైతులు రుణమాఫీ కాకపోవడంతో ఆందోళన చెంది బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2లక్షల రుణ మాఫీ పూర్తి స్థాయిలో చేయలేదన్నారు. గతం లో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ లో మోసం చేసిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే పద్ధతి లో అవలంభిస్తుందని ఆరోపించారు.ఫసల్ బీమాను కూడా ప్రభుత్వమే కట్టుకుంటుందని మాయ మాటలు చెప్పి ఇప్పటి వరకు రైతు భరోసా ఊసే లేకుండ పోయిందని ఆరోపించారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా నాయకులు వెంకట్ రెడ్డి ,సిడా రాకేష్ రమేష్ రెడ్డి, రాందాస్, సాయి, కిరణ్, నరేష్‌లు పాల్గొన్నారు.