బ్రిడ్జి కింద సర్విస్ రోడ్డులో బైక్ కోసం ఇరువర్గాలు గోడవ
సిరా న్యూస్,శంషాబాద్;
శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది యువకులు అర్ధరాత్రి కత్తులతో సంచరిస్తు దాడులను చేయడం కలకలం రేపింది. ఎయిర్ పోర్టు బావర్చీ దగ్గర ఘటన జరింది.
తన బైకు అడ్డుగా ఉన్న బైకును తీయమన్నందుకు ఇది వర్గాలు నెట్టుకోవడం తో గొడవ మొదలయింది. వారిని వద్దని సముదాయించేందుకు వెళ్లిన స్థానిక ఆటో డ్రైవర్ సురేష్ పై కత్తితో తలపై దాడి చేయడంతో తీవ్రంగా రక్తస్రావం జరిగింది. అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారుర. ఆటో డ్రైవర్ సురేష్ తలకు బలమైన రక్త గాయాలు కావడం తో విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు వచ్చి అందోళనకు దిగారు. దాడికి పాల్పడిన వారిలో ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగత పారిపోయిన వారిని పట్టుకునేందుకు పోలీసులు టెక్నికల్ ఆధారాలతో దర్యాప్తు చేస్తున్నారు.
ఎయిర్పోర్ట్ బావర్చి హోటల్ లో ప్రతిరోజు నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి రెండు గంటల వరకు నడుస్తుంది. పలు సార్లు ఇక్కడ గొడవలు జరుగుతన్నా ఈ హోటల్ పై ఇప్పటివరకు ఎలాంటిచర్యలుతీసుకోకపోవడం పై స్థానిక పోలీసులపై పలువిమర్శలు చేస్తున్నారు స్థానికులు
====================