ఈ ఏడాది 30 లక్షల ఒక వెయ్యి రూపాయలకు చేరిన బాలపూర్ లడ్డూ వేలం
సిరా న్యూస్,రంగారెడ్డి;
బాలాపూర్ లడ్డూ వేలం ముగిసింది. కోలన్ శంకర్ రెడ్డి ఈ సారి 30 లక్షల వెయ్యి రూపాయలకు లడ్డూను గెలుచుకున్నారు. ఈసారి బాలాపూర్ లడ్డూ వేలం పాటలో ఆరుగురు పాల్గోన్నారు. గత ఏడాది కంటే 3 లక్షలు అధికంగా బాలాపూర్ లడ్డూ ధర పలికింది. గత ఏడాది 27 లక్షలు బాలాపూర్ లడ్డూ పలికింది.
మరోవైపు లంబోధరుడి నిమజ్జానానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి మాట్లాడుతూ గణనాథ శోభాయాత్ర కు ఒక డీసీపీ,ఒక అడిషనల్ డీసీపీ నలుగురు ఏసీపీలు,12 మంది సిఐలు ల్,26 మంది ఎస్ఐలు 2008 మంది పోలీస్ సిబ్బందితో పాటు రాపిడి యాక్షన్ ఫోర్స్,పార మిలిటరీ బలగాలు,స్పెషల్ పార్టీ పోలీసులు బందోబస్తు పాటు 30 సీసీ కెమెరాలు తో భారీ బందోబస్తును ఏర్సాటు చేసినట్లు తెలిపారు.