Kolanoore PHC : మరీ ఇంత నిర్లక్ష్యమా..?

సిరాన్యూస్, ఓదెల
మరీ ఇంత నిర్లక్ష్యమా..?
రూ. 1.56 కోట్లు వృధా అయినట్టేనా?... అధికారులు కళ్లు తెరవరా?
* చిన్నపాటి వర్షానికి స్లాబ్ నుంచి నీరు
* నాసిర‌కంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ ప‌నులు

ప్రభుత్వాలు చేసే ప్రతి పని ప్రజల సొమ్ము అని మరచిపోతున్నారు ఏమో కానీ ప్రజా ధనం మాత్రం విచ్చవిడిగా వాడేస్తున్నారు. అందుకే సుమారు రూ.1.56 కోట్లు రూపాయల వరకు ప్రజల సొమ్ము బూడిదపాలు చేశారు అధికారులు.. అయితే ఇప్పటికీ కళ్లు తెరవడం లేదు..? వివ‌రాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరు గ్రామంలో 15 ఫైనాన్స్ నిధులు దాదాపు కోటి 56 లక్షలతో నూతన ప్రాథమిక ప్రభుత్వ వైద్య కేంద్రానికి మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి హయాంలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. దీనికి సంబంధించిన కాంట్రాక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నాసిరకంగా నిర్మించడంతో ఈ మధ్యలోనే రాష్ట్ర మంత్రులచే ప్రారంభోత్సవం చేశారు. గడిచిన వర్షానికి స్లాబ్ నుండి నీరు రావడం పలువురిని ఆశ్చర్యపరిచింది. దాదాపు కోటి 56 లక్షలతో నిర్మాణం చేసిన ప్రభుత్వఆస్ప‌త్రి చిన్న వర్షానికి స్లాబ్ నుంచి నీరు రావ‌డం కాంట్రాక్ట‌ర్ ప‌ని త‌నం అర్ధ‌మ‌వుతుంది. దీనికి సంబంధించిన గుత్తేదారు నాసిరకంగా నిర్మాణం చేయడంతో ఇలాంటి జ‌రుగుతాయ‌ని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న వర్షానికి ఇంజక్షన్ గది లాబరేటరీ గది లో వాటర్ వరుస్తుండడంతో ఎవరికి చెప్పాలో ఏం చేయాలో అర్థం కాక వైద్య సిబ్బంది అయోమయంలో పడ్డారు.విపరీతంగా ప్రజాధనం దుర్వినియోగం అయిందని అదేవిధంగా ప్రతి గదిలో పగుళ్లు రావడంతో దాన్ని గమ్ముతోటి పైపైన మెరుగులు దిద్ది ఆగమేఘాల మీద హాస్పటల్ ప్రారంభించడం విచారకరమని పలువురు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు పర్యవేక్షణ చేసి దీనికి సంబంధించిన గుత్తేదారిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *