సిరా న్యూస్, కుందుర్పి
వీరభద్ర స్వామి గుడికి ఆర్థిక సహాయం
* మరోసారి ఉదారత చాటుకున్న కోళ్ల రాధాకృష్ణ
కుందుర్పి మండల కేంద్రంలో నడిబొడ్డున వెలసిన అతి పురాతనమైన బసవన్న గుడి (శివుడు వీరభద్ర స్వామి) యాసిడ్ ట్రీట్మెంట్ గుడి మరమ్మతుల్లో భాగంగా ధర్మకర్త, ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ వాళ్లు సాయం అడిగారు. తక్షణమే కోళ్ల రాధాకృష్ణ రూ. 18000/-దేవాలయ అభివృద్ధికి తన వంతు సహాయంగా చేశారు. పురాతన దేవాలయాల అభివృద్ధికి నీటి వసతులకు బోర్లు వేయించారు. కోళ్ల రాధాకృష్ణ అన్నదాన కార్యక్రమానికి సేవ చేయడం, తదితర సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ గ్రామ ప్రజల మన్ననలు పొందుతున్నారు.