సిరా న్యూస్,మచిలీపట్నం;
మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సర్కిల్ పేటలోని మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ లో ఏర్పాటు చేసిన 116 వ నెంబర్ పోలింగ్ బూత్ లో రవీంద్ర ఓటు వేశారు. రవీంద్ర తో పాటు ఆయన సతీమణి నీలిమ,కుమారుడు పునీత్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని రవీంద్ర పిలుపునిచ్చారు…