రేవంత్ బూట్లు తుడుస్తున్న కోమటిరెడ్డి సోదరులు

సిరా న్యూస్,నల్గోండ;
కోమటిరెడ్డి బ్రదర్స్ మీద నిప్పులు చెరిగారు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి. పదవులు కాపాడుకోవడానికి అన్న, మంత్రి పదవి కోసం తమ్ముడు కలిసి రేవంత్ బూట్లు తుడుస్తున్నారంటూ దుయ్యబట్టారు. కోమటిరెడ్డి బ్రదర్స్ నల్లగొండ జిల్లాకు పట్టిన శని.. రాజకీయాలను వ్యాపారమయం చేశారు.. వాళ్ళకు విలువలు లేవన్నారు. కేసీఆర్ అనుభవం ముందు వీరంతా లిల్లి పుట్స్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు జీవితకాలం వెతికినా.. కేసీఆర్ కు వెంట్రుక పీకలేరన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో రేవంత్ బిజెపి లోకి వెళ్ళడం ఖాయమని వారి సొంత పార్టీ ఎంఎల్ఏ లు చెప్తున్నారన్నారు. నేను ప్రజా సమస్యల మీద పోరాటం చేసి జైలుకు వెళ్తే.. కోమటిరెడ్డి బ్రదర్స్ దొంగల్లా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ను చూసి కోవెల్స్ సైతం సిగ్గు పడతాడని గోబిల్స్ రికార్డును బ్రేక్ చేసిన ఘనత వీరికే దక్కిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *