సిరా న్యూస్,తిరుపతి;
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు కాలం కలిసి రాలేదా? ఏదో విధంగా ఆయనను వివాదాలు చుట్టు ముట్టుతున్నాయా? మళ్లీ వార్తల్లోకి రావడానికి కారణమేంటి? తాజాగా ఆడియో టేప్‌లు ఏం చెబుతున్నాయి? దీనిపై మళ్లీ చర్చించుకోవడం ప్రజల వంతైంది.లేటెస్ట్‌గా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం.. ఓ మహిళతో మాట్లాడిన ఆడియో టేప్ వెలుగులోకి వచ్చింది. నువ్వు చాలా అందంగా ఉన్నావు.. పర్సనాలిటీ చాలా బావుందని వ్యాఖ్యానించారు సదరు ఎమ్మెల్యే. ఈ ఆడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.నెల రోజుల కిందట ఎమ్మెల్యే ఆదిమూలం తనపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ ముందుకొచ్చింది. అంతేకాదు ఏకంగా వీడియోలు విడుదలు చేసింది. ఆ వివాదం ముగియకముందే మరో ఆడియోతో వెలుగులోకి వచ్చారు ఎమ్మెల్యే ఆదిమూలం.సత్యవేడుకు చెందిన టీడీపీకి చెందిన ఓ మహిళా కార్యకర్తను ఎమ్మెల్యే ఆదిమూలం లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఆయనను టీడీపీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారంలో బాధిత మహిళను న్యాయస్థానం ముందు హాజరై స్వయంగా వివరణ ఇచ్చుకుంది. ఎఫ్ఐఆర్‌లో ప్రస్తావించిన అంశాలన్నీ అవాస్తమని పేర్కొంది. కొద్ది రోజుల కిందట సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను వేధిస్తున్నారంటూ టిడిపికి చెందిన ఓ మహిళ నేత ఆరోపించారు. అంతటితో ఆగకుండా తిరుపతిలోని ఓ లాడ్జిలో ఎమ్మెల్యే తనపై లైంగిక దాడి చేశారంటూ సీక్రెట్ కెమెరాతో తీసిన ఫోటోలు, వీడియోను బయటపెట్టారు. ఏకంగా టిడిపి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన హై కమాండ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పై సస్పెన్షన్ వేటు వేసింది. అదే సమయంలో బాధిత మహిళ నేత ఫిర్యాదు మేరకు కేసు నమోదయింది. కోర్టులోకి చేరింది ఈ అంశంఅయితే ఈ కేసు విషయంలో రాజీ పడ్డారు బాధిత మహిళ. తనపై ఎమ్మెల్యే ఆదిమూలం ఎటువంటి వేధింపులకు పాల్పడలేదంటూ ఆమె తరుపు న్యాయవాది లిఖితపూర్వకంగా కోర్టులో తెలియజేశారు. దీంతో కేసు రాజీకి మార్గం ఏర్పడింది. అయితే ఇంతలో అదే ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గొంతుతో కూడిన ఆడియో హల్ చల్ చేస్తోంది. తెగ వైరల్ అవుతోంది. అయితే ఆ గొంతు ఎమ్మెల్యే ఆదిమూలానిదా? కాదా? అన్నది తేలాల్సి ఉంది.బాధితురాలితో తాము రాజీకి వచ్చామని కేసు అవసరం లేదని ఎమ్మెల్యే తరపు అడ్వకేట్ న్యాయస్థానం ముందు చెప్పిన విషయం తెల్సిందే