సిరా న్యూస్, చిగురుమామిడి
పీహెచ్‌డీ డాక్టరేట్ పట్టా పొందిన కొంకట అనూష
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామానికి చెందిన కొంకట అనూష ఉస్మానియా యూనివర్సిటీ ఎలక్ట్రానిక్స్ అగ్రికల్చర్ లో పీహెచ్ డీ పట్టా పొందారు. ప్రస్తుతం ఆమె అదిలాబాద్ జిల్లా టిడబ్ల్యూడిసి లో డిగ్రీ అధ్యాపకురాలుగా పనిచేస్తున్నారు. అనూష తండ్రి రాజయ్య సింగరేణిలో ఫోర్ మెన్ గా పనిచేస్తున్నారు. తండ్రి రాజయ్య, తల్లి రమ,భర్త నరేష్ లా ప్రోత్సాహంతో పీహెచ్‌డీ కొనసాగించారు. చదువు పూర్తి చేసి ఉస్మానియా యూనివర్సిటీ నిజం కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సివి రంజని చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా అందుకున్నారు. డిగ్రీలో గోల్డ్ మెడల్ అందుకున్నారు.ప్రొఫెసర్ రంజని అనుషను అభినందించారు. చిన్న వయసులోనే అధ్యాపకురాలుగా ఉద్యోగం సంపాదించడం ,ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ డాక్టరేట్ పట్టా పొందడం పట్ల సహచర అధ్యాపకులు,ఉద్యోగ సంఘాల నాయకులు పలువురు అభినందించారు.