సిరాన్యూస్, ఆదిలాబాద్
గెస్ట్ లెక్చరర్ల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం
తెలంగాణ రాష్ట్ర డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డా.కొర్ర ఈశ్వర్ లాల్
మన హక్కులు, డిమాండ్ల, సమస్యల పరిష్కార సాధన కోసం ఈ నెల 13 న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో నిర్వహించే గేస్ట్ లెక్చరర్ల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డా.కొర్ర ఈశ్వర్ లాల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పని చేస్తున్న డిగ్రీ గెస్ట్ లెక్చరర్లను ఆటో రెన్యువల్ తో కంటిన్యూ చేయాలి ,కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రతి నెలకు 50 వేల కన్సాలిడేటెడ్ పే జీతం ను తక్షణం అమలు చేయాలి, ప్రమోషన్లు , ట్రాన్స్ఫర్స్ ద్వారా డిస్టర్బ్ అయ్యే గెస్ట్ లెక్చరర్ లను రీ లోకేట్ చేయాలి, ఇ హెచ్ యస్ కార్డులు జారీ చేసి, ప్రమాదాలు , ఏదైనా రిస్కు జరిగిన ప్రమాద భీమా తో పాటు 20 లక్షల పరిహారం ఇవ్వాలి, డిగ్రీ గెస్ట్ లెక్చరర్లను కాంట్రాక్టు ఎంప్లాయిస్ , పార్ట్ టైం లెక్చరర్స్ , మినిమం టైం స్కేల్ల్ ఉద్యోగులుగా కన్వర్ట్ చేయాలని కోరారు. ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి అధిక మొత్తం లో గెస్ట్ లెక్చరర్ లు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.