సిరా న్యూస్, చిగురుమామిడి
కుల వివక్ష పాటించడం నేరం
* ఎంపీపీ కొత్త వినిత శ్రీనివాస్ రెడ్డి
* కొండాపూర్ లో పౌర హక్కుల దినోత్సవం
కుల వివక్ష పాటించడం నేరమని ఎంపీపీ కొత్త వినిత శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని కొండాపూర్ గ్రామంలో గురువారం పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ కొత్త వినిత శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడారు. కులమనే సాంఘిక దురాచారాన్ని విడనాడి అందరూ సమానం అనే భావనతో జీవించాలన్నారు. ఈకార్యక్రమంలో జడ్పిటిసి గీకురు రవీందర్, తహసిల్దార్ ఇప్ప నరేందర్, ఎంపీడీవో మధుసూదన్, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి శ్రీధర్, కార్యదర్శి పోలీస్ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.