సిరాన్యూస్, బోథ్
కౌట(బి)లో మేయర్ కొరవి కృష్ణ స్వామి జయంతి వేడుకలు
బహుజన సమాజ సంస్కర్త హైదరాబాద్ తొలి నగర మేయర్ కొరివి కృష్ణస్వామి అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని ముదిరాజ్ సంఘం సభ్యులు పేర్కొన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కౌట(బి) గ్రామంలో 131 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి జెండాను ఎగరవేశారు. ఈసందర్భంగా ముదిరాజ్ సంఘం సభ్యులు మాట్లాడారు. హైదరాబాద్ పట్టణానికి మొదటి మేయర్ గా ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు.కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం గ్రామ అధ్యక్షులు సున్నపు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జెట్టి రాజేశ్వర్, ఉపాధ్యక్షులు కే సాయన్న, సలహాదారు నరేష్ ,యూత్ అధ్యక్షులు కొర్రి సంతోష్, మండల యూత్ అధ్యక్షులు మెండు శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, గ్రామ విడిసి అధ్యక్షులు గాజుల సురేందర్, మాజీ సర్పంచ్ లంకటి నరసయ్య, మాజీ ఉపసర్పంచ్ రవీందర్, మాజీ సహకార సంఘం అధ్యక్షులు నోముల బాబు రెడ్డి , ఎమ్మార్పీఎస్ నాయకులు పాలెపు గోపి, పి ప్రసాద్ , లంకటిచ్చిన్న, నరసయ్య , పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.