సిరాన్యూస్, భీమదేవరపల్లి
కొయ్యడ ప్రణయ్ కుమార్ ను సత్కరించిన బహుజన నేతలు
జనగామ జిల్లా రఘునాథ్ పల్లి చెందిన వాస్తవ్యుడు కోయ్యడ ప్రణయ్ కుమార్ భారతీయ సివిల్ సర్వీస్ లో దేశ వ్యాప్తంగా 554 ర్యాంక్ సాధించడం హర్షించదగ్గ విషయమని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్ అన్నారు. సోమవారం కొయ్యడ ప్రణయ్ కుమార్‌ను బహుజన నేతలు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరములో అఖిల భారతియ సర్వీస్ లో ఐఅర్ఎస్ విభాగములో సెలెక్ట్ అయి ఢిల్లీ లో ఐఅర్ఎమ్ఎస్ గా భాద్యతలు నిర్వర్తిస్తు తను ఐఏఎస్ కావాలన్న తన కోరికను కసితో సాధించారని తెలిపారు. కార్యక్రమములో తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి కండె సుధాకర్, ఎమ్.అర్.పి.ఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ ఇంఛార్జి మాట్ల వెంకటస్వామి, పొన్నాల వినోద్ కుమార్, వేముల జగదీష్, గిరిమల్ల చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.