సిరా న్యూస్, సొనాల
సహజసిద్ధమైన రంగులను చల్లుకోవాలి
* ప్రిన్సిపల్ కృష్ణ చైతన్య
* వివేకానంద స్కూల్‌లో హోలీ సంబరాలు
ఆదిలాబాద్ జిల్లా సొనాలలో వివేకానంద స్కూల్ ఇ/మీలో శనివారం ముందుగానే హోలీ సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల పొడి రంగులను విద్యార్థులు చల్లుకున్నారు.అందరూ హాని కారకమైన రంగులు కాకుండా, పొడి రంగులు,సహజ సహజసిద్ధమైన రంగులను చల్లుకోవాలని, హోలీ పండగ యొక్క విశిష్టతను ప్రిన్సిపల్ కృష్ణ చైతన్య విద్యార్థులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కోస్మెట్ శుద్దోధన్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.