సిరా న్యూస్,పెద్దపల్లి;
పెద్దపల్లి సిఐగా కృష్ణ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ సిఐగా పని చేసిన అనిల్ కుమార్ ఐజి కార్యాలయానికి బదిలీ కాగా, లక్షెట్టిపేటలో సిఐగా పనిచేస్తున్న ఆర్ కృష్ణను పెద్దపల్లి సిఐగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. భాద్యతల స్వీకరణ అనంతరం ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి, ధర్మారం, బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చిన ఆయా పోలీస్ స్టేషన్లలో లేదా నేరుగా సర్కిల్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు జరిగితే సంబంధిత పోలీస్ స్టేషన్లకు, 100 కు డయల్ చేయాలని, సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.