అంబర్ పేటలో కేటీఆర్ దిష్టిబొమ్మల దగ్దం

సిరా న్యూస్,హైదరాబాద్;
మహిళల ఉచిత బస్ ప్రయాణం పై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అంబర్ పేట శ్రీరమణ చౌరస్తాలో ఖైరతాబాద్ మహిళా అధ్యక్షురాలు షంబుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.ఈ సందర్భంగా శంభుల ఉషశ్రీ మాట్లాడుతూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పట్ల అనుచితంగా మాట్లాడారు. మహిళలను కించపరుస్తూ బస్ లలో బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్స్ లు చేయండి అంటూ అత్యంత ఆవహేళన గా మాట్లాడారు.తెలంగాణ మహిళల పట్ల ఇంత అవమాన కరంగా మాట్లాడి వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన కేటీఆర్ వైఖరిని నిరసిస్తూ అన్ని మండల, నియోజక వర్గ, జిల్లా కేంద్రాలలో దిష్టి బొమ్మల దగ్ధం, నిరసన కార్యక్రమాలు చేశామని తెలిపారు.ఈ నిరసన కార్యక్రమాలలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని ఆయన మహిళ లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *