హైడ్రో ఏర్పాటును స్వాగతించిన కూకట్ పల్లి ఎమ్మెల్యే

సిరా న్యూస్,హైదరాబాద్;
హైడ్రా పని తీరు పై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రెస్ మీట్ నిర్వహించారు. చెరువుల పరిరక్షణకు హైడ్రా ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. చెరువుల సంరక్షణకు నాళాల ఆక్రమణలు కూడా తొలగించి, చెరువులను అభివృద్ది చేయాలి. కూకట్పల్లిలో ఓ చెరువులో ఉన్న శ్మశాన వాటికకు, 40 సంవత్సరాలుగా ఉన్న ఆలయానికి నోటిసులు ఇవ్వటం శోచనీయమి అన్నారు. చెరువుల ఆక్రమణలు తెలియక., అన్ని అనుమతులున్నాయని ఇళ్ళను కొనుగోలు చేసిన వారికి ప్రభుత్వం ఏ పరిష్కారం చూపిస్తుంది??? కూకట్పల్లి మైసమ్మ చెరువులో ఉన్న రాజీవ్ గాంధీ నగర్ లో పట్టాలు కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసింది.. అక్కడ హైడ్రా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది. చెరువుల ఆక్రమణలు తెలియక కొనుగోలు చేసిన పేద,మధ్యతరగతి వారికి ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేస్తారు?? చెరువుల పరిరక్షణకు ఓ నోడల్ ఆఫీసర్, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి కమిటీలు ఏర్పాటు చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *