సిరాన్యూస్, కుందుర్పి
కుందుర్పిలో వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం ఇంటింటా ప్రచారం
కుందుర్పి మండల కేంద్రంలోనీ పలు వార్డులలో శనివారం వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఐదు సంవత్సరాల లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్దకే పలు సంక్షేమ పథకాలను అందించిన తీరును, చేసిన అభివృద్ధిని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈనెల 13 సోమవారం న జరుగు సార్వత్రిక ఎన్నికలలోవైఎస్ఆర్సీపీ ఫ్యాను గుర్తు కు ఓటేసి కళ్యాణదుర్గం నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తలారి రంగయ్య అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి మాలగుండ్ల శంకర్ నారాయణ అత్యధిక మెజార్టీతో గెలిపించి మన జగనన్నకు కానుకగా ఇద్దామని తెలిపారు. అలాగే మన రాష్ట్రానికి మరొకసారి ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డిని చేసుకుందామన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ నీలీ శంకరప్ప, శ్రీ మల్లేశ్వర ఆలయ ధర్మకర్త మల్లూరు వెంకటేశులు, మాజీ సింగల్ విండో డైరెక్టర్ వసంత రాయుడు, బాగేపల్లి చంద్ర, రాముస్వామి,మల్లేశప్ప, మాచుపల్లి పవన్ ,కంసలటైలర్ ప్రసాదు ,మేకలరామంజి,నాగరాజు, మేకల అజయ్ తదితరులు ఉన్నారు.