Kundurpi: ఘనంగా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి రథోత్సవం

సిరాన్యూస్‌, కుందుర్పి
ఘనంగా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి రథోత్సవం

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని కుందుర్పి మండలం ఎనుములదొడ్డి గ్రామంలో కొలువుతీరిన శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రథోత్సవ ఉత్సవాలు సోమ‌, మంగ‌ళ‌వారాల్లో నిర్వ‌హిస్తున్న‌ట్లు గుడి యొక్క ప్రధాన అర్చకులు శ్రీనివాసులు , గ్రామ పెద్దలు గ్రామ సర్పంచ్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఉదయం గణపతి పూజ, గంగ పూజ, నవగ్రహాల పూజ, ప్రధాన అర్చకులు భక్తులు రథోత్సవ వేడుకలను ప్రారంభించారు. శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహాన్ని పల్లకిలో అధిష్టింప జేసి ఊరేగింపుల తో రథోత్సవంలో ప్రతిష్ట చేశారు. సాయంత్రం 4 గంటల సమయం నుండి స్వామివారి రథోత్సవము కొనసాగుతుంది. ఎనుములదొడ్డి గ్రామంలో శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వెలసి గత 20 సంవత్సరాలు అయినప్పటికీ 2012 వ సంవత్సరం నుండి రథోత్సవము జరుగుతుందని ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ రథోత్సవం ప్రతి సంవత్సరం మే నెలలో జరుగుతుంది. ఈ ఉత్సవంలో గ్రామంలో ఉన్నటువంటి వేలాది మంది ప్రజలు,భక్తులు చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామాల నుండి వచ్చే భక్తులు స్వామివారి కటాక్షం పొందాలని వస్తారు. ఈ ఉత్సవానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుని తమ కోరికలను తీర్చమని వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ ఉత్సవంలో భక్తులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గ్రామ సర్పంచ్ మహాదేవమ్మ కుమారుడు విజయ్ కుమార్ గ్రామ పెద్దలు బొమ్మలింగ, ఎక్స్ ఎం పి టి సి బసవరాజు, ప్రసాద్, అంజి, ప్రభాకర్, బోయ సన్నప్పయ్య, చాంద్ బాషా, బొమ్మలింగప్ప, కాకి గంగాధర, చిన్న రాయుడు తదితర నాయకులు, గ్రామ పెద్దలు ఈ ఉత్సవాన్ని ఘనంగా జరిపించారు. అదే విధంగా 144 సెక్షన్ అమల్లో ఉన్నందున కళ్యాణదుర్గం సీ ఐ నాగరాజు కుందుర్పి హెడ్ కానిస్టేబుల్ అక్కులప్ప, సురేష్, పోలీస్ సిబ్బందితో ఎటువంటి గొడవలు జరగకుండా రథోత్సవం జరిపించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *