కుందుర్తి, సిరా న్యూస్
కుందుర్తి మండల సేవా ట్రస్ట్ ను భారత సేవా రత్న పురస్కారం
ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతలే మిన్న అంటారు. మానవయే మాధవ సేవ అని గుర్తుంచుకోవాలి. రక్తదానం, అన్నదానం, కంటి, గుండె వైద్య శిబిరాల నిర్వహణ, పేద వారికి సరుకుల పంపిణీ లాంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుకు నడిచారు. అనంతపురం జిల్లా కుందుర్తి , కల్యాణదుర్గం నియోజకవర్గాల్లో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. 26 రకాల సేవలకు పైగా విస్తరిస్తూ ఇతర రాష్ట్రాల్లో ఉన్న సంస్థలతో పరిచయాలు పెంచుకుని ప్రజలకు సేవలు విస్తరిస్తున్నారు. ఈనెల 28న విశాఖపట్నం తాసుబెల్లి ఫౌండేషన్ ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో 500 స్వచ్ఛంధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ముందుకు వెళ్తున్నారు. భారత రత్న సేవా పురస్కారానికి కుందుర్తి మండల ట్రస్ట్ సేవా సంస్థకు ఎంపిక కావడం గమనార్హం. ఈ మేకు ట్రస్ట్ అధ్యక్షుడు శంకర్ నాయుడు, వెంకటలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు.