సిరాన్యూస్, ఇచ్చోడ
ముస్లిములకు మాజీ సర్పంచ్ ఇఫ్తార్ విందు
రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం మైనార్టీలు ఉపవాస దీక్షలు చేపడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ మహిళా సర్పంచ్ భర్త కుంట సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇచ్చోడ మండలం బోరిగామ గ్రామంలో ఆదివారం సాయంత్రం మజీద్ లో ముస్లిములకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ముస్లిం మైనార్టీ మతస్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఉపవాస దీక్షలను విరమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ముస్లిం మైనార్టీ సోదరులు రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ ముస్లిం మైనార్టీ మతస్తులు, ఆసిఫ్ ఖాన్, గులాబ్ ఖాన్, అమీర్, మహబూబ్, తదితరులు పాల్గొన్నారు.