Kunthi Madava Temple: డిసెంబర్ 17నుంచి ధనుర్మాస మహోత్సవాలు..

సిరా న్యూస్, పిఠాపురం:

డిసెంబర్ 17నుంచి ధనుర్మాస మహోత్సవాలు..

పిఠాపురం పట్టణంలోని కుంతీ మాధవ స్వామి వారి దేవస్థానం ధనుర్మాస మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో సీహెచ్ రమణమూర్తి బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 17 ఆదివారం నుండి జనవరి 15 వరకు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటలకు స్వామి వారికి అభిషేకము, విశేష పూజలతో పాటు ప్రసాద వితరణ జరుగుతుందన్నారు. డిసెంబర్ 23న శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 5 గంటలకు ఉత్తరద్వార దర్శనం జరుగుతుందని, కావున అశేష భక్తజనం తరలివచ్చి స్వామి వారిని దర్శించుకోవాలని కోరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మీడియాకు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *