Kyatham Ram Reddy:లింగ వివక్షతను చూపరాదు

సిరా న్యూస్,జైన‌థ్‌
లింగ వివక్షతను చూపరాదు
* కాన్పమేడిగూడ విడిసి చైర్మన్ క్యాతం రాంరెడ్డి
* అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సహలు
లింగ వివక్షతను చూపరాదని కాన్పమేడిగూడ విడిసి చైర్మన్ క్యాతం రాంరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్, కాన్పమేడిగూడ రోడ్ అంగన్ వాడీ సెంటర్-3 లో శ‌నివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సహలు నిర్వ‌హించారు. ఈసంద‌ర్బంగా గర్భిణులకు, పిల్లల తల్లులకు పౌష్టికాహారం, బాల్య వివాహాలు , రక్తహీనతవల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించారు. అనంత‌రం కాన్పమేడిగూడ విడిసి చైర్మన్ క్యాతం రాంరెడ్డి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. బాల్యా వివాహలకు వ్యతిరేకంగా పోరాడాలని సూచించారు. పిల్లలకు, గర్భిణులకు పౌష్టికాహారం లోపం లేకుండా చూడాలని అన్నారు. మార్చి ఒకటవ తారీఖు నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవ మార్చి ఎనిమిది వరకు వివిధ రూపాల్లో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని అంగన్ వాడి సెంటర్ -3 ఉపాధ్యాయురాలు ఇప్ప కళావతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాన్ప మేడిగూడ రోడ్ గ్రామ అభివృద్ధి చైర్మన్ క్యాతం రాంరెడ్డి,అంగన్ వాడి సెంటర్ -3 టీచర్ కళావతి ,ఆశ వర్కర్ సుంకరి వెంకటమ్మ, గర్భిణులు, పిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *