సిరాన్యూస్, కోనరావుపేట
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన చల్మెడ లక్ష్మీనరసింహారావు
కోనారావుపేట మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన ఔరం శరత్ తల్లి ఔరం రాజవ్వ ఇటీవల మృతి చెందారు. సోమవారం ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి వెంట సీనియర్ నాయకులు రాఘవరెడ్డి, ఎంపీపీ చంద్రయ్య గౌడ్, మాజీ సర్పంచ్ సంతోష్, ప్యాక్స్ చైర్మన్ రామ్మోహనరావు, గెంట శ్రీనివాస్, ఉప్పుల శ్రీనివాస్, మైలారం రాము, మధు, రాజు, దినకర్ తదితరులు ఉన్నారు.