సిద్దిపేట నుండి సిరిసిల్ల కు రైల్వే లైన్ భూసేకరణ

సిరా న్యూస్,సిద్దిపేట;
జిల్లాలోని చిన్నకోడూరు నారాయణరావు పేట మండలాల్లో పెండింగ్ లో ఉన్న భూ సేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చెయ్యాలని రెవెన్యూ అధికారులనుజిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి ఆదేశించారు

కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో రైల్వే ప్రాజెక్టు ముఖ్య అధికారులు, రెవెన్యూ అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
రైల్వే అదీకారులు ఈ సమావేశంలో జిల్లాలో చిన్నకోడూరు, నారాయణ రావు పేట మండలాల్లో పెండింగ్ లో ఉన్న భూ సేకరణ వివరాలు గురించి రైల్వే అధికారులు కలెక్టర్ కు తెలిపారు.
ఈ సమావేశం లో కలెక్టర్ మాట్లాడుతూ.. చిన్నకోడూరు మండలం లో పెద్దకోడుర్, చిన్నకోడూరు మాచాపూర్ గంగాపూర్ విఠలాపూర్ నారాయణరావు పేట, మండలం లో గుర్రాల గొంది, జక్కాపూర్ గ్రామాల్లో పెండింగ్ లో ఉన్న భూసేకరణను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని ఆయా మండల తహసీల్దార్ లకు తెలిపారు. ఆయా భూసేకరణను వేగంగా పూర్తి చేసి రైల్వే అధికారులకు అప్పగించాలని తెలిపారు. కొన్ని గ్రామాల్లో స్టోన్ బ్లాస్టింగ్ వలన పంట నష్టపోతున్న రైతులు నష్ట పరిహారం అందాకే పనులు జరపాలని, రైతులు అడ్డుతగులుతున్నారని తెలుపగా త్వరగా నష్ట పరిహారం అందించాలని కలెక్టర్ రైల్వే అధికారులకు తెలిపారు.
ఈ సమావేశం లో ఆర్డిఓ పి. సదానందం, రైల్వే అధికారులు మూర్తి, జనార్దన్ ఇతర అధికారులు అయా మండల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *