సిరా న్యూస్,శ్రీకాళహస్తి;
కార్తీక మాసం మూడో సోమవారం పురస్కరించుకొని శ్రీకాళహస్తి దేవస్థానం మరియు వివిధ ఆలయాల్లో భక్తులు ఉదయాన్నే కార్తిక దీపారాధన చేస్తూ ఓం నమఃశివాయ పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ, భక్తిశ్రద్దలతో శివయ్యను దర్శించుకున్నారు, కొంతమంది భక్తులు కార్తిక దీపారాధన చేస్తున్న భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు.మహిళా భక్తులు మాట్లాడుతూ..
కార్తీకమాసం శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైనదని
ఈ నెల రోజులు పూజ చేసినా.. ముఖ్యంగా సోమవారం ఉపవాసం ఉండి.. అత్యంత భక్తిశ్రద్దలతో శివకేశవులను పూజిస్తే సత్ఫలితం దక్కుతుందని అయితే సోమవారం రోజు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుందని 365 జ్యోతులతో కార్తిక దీపారాధన చేస్తే సంవత్సరం రోజులు దీపాలు పెట్టిన పుణ్యఫలితం దక్కుతుందని భక్తుల విశ్వాసం.
ఈ కార్తీకమాసంలోకార్తీక దీపారాధన చేస్తే సౌభాగ్యంతోపాటు ఇంటిలో లక్ష్మీదేవి కటాక్షస్తుందని, కైలాస ప్రాప్తిరస్తు లభిస్తుందని తెలియజేశారు.