గడ్డెన్న వాగు ప్రాజెక్టు తాజా వివరాలు

సిరా న్యూస్,నిర్మల్;
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గడ్డెన్న వాగు ప్రాజెక్టు వివరాలను అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 358. 70 అడుగులు ఉండగా, ప్రస్తుత నీటిమట్టం 355. 80 అడుగులు ఉందని పేర్కొన్నారు. ఈ యేడు జులై మాసం ముగుస్తున్నప్పటికి అత్యధిక వర్షపాతం నమోదవ్వలేదు. దింతో ఇంతవరకు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టనికి చేరుకోలేదు. ఇప్పటివరకు గేట్లను తెరిచే అవకాశం రాలేదు. ప్రస్తుత నీటిమట్టంలో నుండి మిషన్ భగీరథకు 20 క్యూసెక్కుల నీరు వదులుతున్నట్లు వెల్లడించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *