ఖమ్మంలో లేజర్ మ్యూజికల్ ఫౌంటేన్ ఎగ్జిబిషన్ ప్రారంభం

ముఖ్యఅతిథిగా మేయర్ పూనుకొల్లు నిరజ
 సిరా న్యూస్,ఖమ్మం;
దసరా పండగ సందర్భంగా ఖమ్మం నగరంలో పెవిలియన్ గ్రౌండ్ మైదానంలో ఏర్పాటు చేసిన లేజర్ షో ఫెస్టివల్ ఎగ్జిబిషన్ ను నగర మేయర్ పూనుకొల్లు నిరజ ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇండియా లోనే మొట్ట మొదటిసారిగ దసరా పండగ సందర్భంగా పిల్లలకు , పెద్దలకు , యువతకు అన్ని వయసుల వారికి ఆహ్లాదం కలిగించే విధంగా ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేయడం సంతోష్కరంగా ఉందన్నారు . పట్టణ ప్రజలు సాయంకాలం వేల కుటుంబ సమేతంగా వచ్చి ఆనందంతో గడపాలని కోరారు . ఈ సందర్భంగా నిర్వాకులు బాలశౌరి , అప్పిరెడ్డి , అచ్చయ్య లు మాట్లాడుతూ 45 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుందని తెలియజేశారు . ఈ ఎగ్జిబిషన్లో అద్భుతమైన లేజర్ ఏర్పాటు చేయబడిందని దీనితోపాటు ఎంటర్టైన్మెంట్ కోసం 80 ఫీట్ల జాయింట్ వీల్ , బెంగళూరు పాలిసే 100 అడుగుల ముఖద్వారం , మేరీ కొలంబస్ , బ్రేక్ డాన్స్ , డ్రాగన్ ట్రైన్ , క్రాస్ వింగ్ తో పాటు అనేక రకాల స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు . ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ కమర్తపు మురళి , పాలెపు వెంకటరమణ , బుడిగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *