సిరా న్యూస్,బోగోలు;
బోగోలు మండల కేంద్రమైన బిట్రగుంట ప్రధాన కూడలిలో ఒకటైన అరవపాలెం సెంటర్ వద్ద బోగిరి మోజస్ సారమ్మ జ్ఞాపకార్థమై పావని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నెల్లూరు జిల్లా ఎరుకుల సంఘ అధ్యక్షులు బోగిరి ప్రభాకర్ ఈనెల 19వ తేదీ నుండి 25వ తేదీ వరకు కొండ బట్రగుంటలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో బ్రహ్మోత్సవాలకు తరలి వెళ్లే భక్తుల దాహార్తి తీర్చడం కోసమై నిన్న ఉదయం 10 గంటలకు చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ చలివేంద్రం ఎంతోమంది భక్తుల దాహార్తిని తీర్చేందుకు దోహద పడుతుందని ఆయన తెలియజేశారు. బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు చలివేంద్రాన్ని కొనసాగిస్తామని తదుపరి స్థల మార్పిడి చేసి రానున్న ఎన్నికల దృష్ట్యా కొత్త చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన తెలియజేశారు. చాలామంది భక్తులు చలివేంద్రం ఏర్పాటు పై హర్షం వ్యక్తం చేశారు.