సిరా న్యూస్,హైదరాబాద్;
కొత్తగా ఏర్పడ్డ మూడు క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జేఏసీ నిరసన కార్యక్రమం చేపట్టింది. తెలంగాణ హై కోర్టు ముందు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. తక్షణమే మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రతిపక్షాలను బయటకు పంపి…చర్చలేకుండా ఆమోదించిన చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదకరమైన టెక్నాలజీని సాక్షాలుగా ఉపయోగించే చట్టాలు దేశానికి ప్రమాదకరమని అన్నారు. 90 రోజులపాటు బెయిల్ రాకుండా కస్టడీలోనే ఉంచే చట్టాలు…బలహీన ప్రజలను అక్రమంగా జేల్లో పెట్టేవని ఆరోపించారు.