సిరాన్యూస్, ఇచ్చోడ
పిల్లలకు పెయింటింగ్ కిట్స్ ను అందజేసిన ప్రాజెక్టు డైరెక్టర్ ఊరికి లక్ష్మణ్
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని బోరిగామ గ్రామంలోని 2 వ అంగన్వాడి కేంద్రంలో శనివారం డ్రీమ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో యుఎస్టి గ్లోబల్ వెల్ఫేర్ ఫౌండేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ ఊరికి లక్ష్మణ్ పిల్లలకు పెయింటింగ్ కిట్స్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటపాటలతో పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డ్రీమ్స్ స్వచ్ఛంద సంస్థ క్లస్టర్ కోఆర్డినేటర్ హేమలత, అంగన్వాడి టీచర్లు చంద్రకళ, లక్ష్మి, ఆయాలు పాల్గొన్నారు.