సిరా న్యూస్, జైనథ్:
బుధవారం లక్ష్మీనారాయణ స్వామి సాగు భూముల వేలం
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయానికి సంబంధించిన 62 ఎకరాల సాగు భూమిని 2024-25 సంవత్సరానికి గాను సాగు కోసం బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో వామన్ రావు తెలిపారు. ఉదయం 10:30 నిమిషాలకు ఆలయంలో వేలంపాట నిర్వహించడం జరుగుతుందని, ఆసక్తి గల రైతులు పాల్గొనాలని కోరారు. 6 సర్వే నంబర్లలో మొత్తం 62 ఎకరాల సాగు భూమి ఉందని, వేలంపాటలో పాల్గొనే రైతులు సర్వే నెంబర్ కు రూ. 20 వేల చొప్పున నగదును డిపాజిట్ చేయాల్సి ఉంటుందని అన్నారు. వేలంపాటలో భూములు దక్కని వారికి, అట్టి డిపాజిట్లు తిరిగి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి గల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.