సిరా న్యూస్, జైనథ్:
రామ మందిరం కోసం రూ. 51 వేల విరాళం…
– ఉదారత చాటిన మాజీ సర్పంచ్ ఆడప తిరుపతి రమాదేవి దంపతులు
మాజీ సర్పంచ్ ఆడప తిరుపతి, రమాదేవి దంపతులు రామ మందిరం విగ్రహాల కోసం రూ. 51 వేల విరాళం అందించి ఉదారత చాటుకున్నారు. ఈ సందర్భంగా శనివారం వారు తమ కుటుంబ సభ్యులతో కలిసి, గ్రామస్తులు దాసరి రాములు, గాజంగుల స్వామి, అల్లూరి కల్చాప్ రెడ్డి, సోర్తె గజానన్, భగత్ భీమ్ రావ్, భద్రే సుభాష్, హెడవ్ అశోక్, అనుపట్ల స్వామి, కామ్రే భీమ్ రావ్, గోపతి నరేష్ తదితరులకు డబ్బులు అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ… తమ స్వగ్రామమైన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో నిర్మిస్తున్న రామ మందిరం విగ్రహాల కోసం తమవంతుగా ఆర్థిక సహాయం అందించడం సంతోషంగా ఉందన్నారు.