సిరా న్యూస్, డిజిటల్:
ఎల్బీ స్టేడియం సమావేశానికి తరలి రావాలి
– సమగ్ర శిక్షా రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్
ఈ నెల 3న హైదరబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఉదయం 9 గంటలకు నిర్వహిస్తున్న సమావేశానికి సమగ్ర శిక్షా వివిద విభాగాల రాష్ట్ర నాయకులు, వివిద జిల్లా జేఏసీల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులంత తప్పక హాజరు కావాలని తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్ అన్నారు. మంగళవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, కాంగ్రేస్ పార్టీ ముఖ్య నాయకులను కలిసి సమస్యలు విన్నవించనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులందరిని రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్‌తో కొత్త ప్రభుత్వంలోని ప్రముఖులను కలువనున్నట్లు ఆయన తెలిపారు. సంఘం నాయకులు పెద్ద ఎత్తున హాజరై, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.