సిరా న్యూస్,హైదరాబాద్;
రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను హైదరాబాద్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బైరి వెంకటేష్ మోచి ఆధ్వర్యంలో వచ్చిన ప్రతినిధులు కలిసారు. ఎస్సీ వర్గీకరణలో రాష్ట్ర ప్రభుత్వం 57 ఉప కులాలను గ్రూప్ – A లో నమోదు చేయాలని వినతిపత్రం సమర్పించారు
ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వచ్చిన ప్రతినిధులు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ పై ఇచ్చిన తీర్పు అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీ ఉప కులాల జన గణన చేపట్టి గ్రూప్ – A లో నమోదు చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ గారికి విజ్ఞప్తి చేశారు. ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి ప్రతినిధులు చేసిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు మంత్రి దామోదర్ నరసింహ.