ఆదిలాబాద్, సిరా న్యూస్
జనవరి 22 పాఠశాలలకి సెలవు ప్రకటించాలి తపస్
అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన ఈ నెల 22న జరగనున్నందున ఆ రోజు సెలవు ప్రకటించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్ ) ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ ను కలిసి కోరారు. అనంతరం తపస్ నూతన డైరీ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో టీవీల్లో చూసేందుకు సెలవు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సునీల్ చౌహాన్, వలభోజు గోపిక్రిష్ణ, నాయకులు మిట్సల్లి గోపాల క్రిష్ణ, చదల రాజేశ్, తొగరి ప్రకాష్, కేశవ్ తదితరులు పాల్గొన్నారు.