-మెట్ పల్లి ఆర్డీవో ఎన్.శ్రీనివాస్.
సిరా న్యూస్,మెట్ పల్లి ;
వయోవృద్ధులైన తల్లిదండ్రుల పోషణ,సంరక్షణ, భద్రత కల్పించాల్సిన బాధ్యత పిల్లలదేనని,వారిని విస్మరించేవారు శిక్షార్హులేనని మెట్ పల్లి ఆర్డీవో ఎన్.శ్రీనివాస్ అన్నారు. ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ మెట్ పల్లి డివిజన్ శాఖ ఆధ్వర్యంలో వయోవృద్ధుల పోషణ,సంక్షేమ చట్టం పై అవగాహన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సీనియర్ సిటీజేన్స్ జిల్లా అసోసియేషన్ ముద్రించిన వయోధికుల సంక్షేమ,రక్షణ చట్టం 2007 నియమావళి 2011 చట్టం సంక్షిప్త సమాచార అవగాహన పత్రికలను ,సీనియర్ సిటీజేన్స్ పిలుపు పుస్తకాలను మెట్ పల్లి ఆర్డీవో ఎన్.శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ తల్లిదండ్రులైన వయో వృద్ధులను పోషించక నిరాదరిస్తున్న,వేధిస్తున్న వారిపై తమకి ఫిర్యాదులు చేయవచ్చన్నారు.వేధింపులకు గురి చేసిన వారికి వయో వృద్ధుల సంరక్షణ చట్టం 2007 సెక్షన్ 24 ప్రకారం 6 నెలల వరకు జైలు శిక్ష తో పాటు జరిమాన విధించే వీలుందన్నారు. జిల్లాలో వయోధికుల రక్షణ,నిరాదరణ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న సీనియర్ సిటీజన్స్ రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ను, మెట్ పల్లి డివిజన్ పరిథి లో సేవలను అందిస్తున్న సీనియర్ సిటీజన్స్ డివిజన్ అధ్యక్షుడు ఒజ్జల బుచ్చిరెడ్డి,డివిజన్ కార్యవర్గ ప్రతినిధులను ఆర్డీవో అభినందించారు.సీనియర్ సిటిజెన్ల రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో జగిత్యాల,మెట్ పల్లి,కోరుట్ల డివిజన్ లో వయోవృద్ధుల కేసుల పరిష్కారంలో రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా జగిత్యాల జిల్లా నిలిచిందన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వయోవృద్ధుల చట్టం పకడ్బందీగా అమలుకు జిల్లా కలెక్టర్లకు,పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారన్నారు. కోటి రూపాయల నిధులతో జగిత్యాల జిల్లా కేంద్రంలో చేపట్టిన వృద్దాశ్రమ నిర్మాణం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి,మంత్రి సీతక్కకి కృతజ్ఞతలు తెలిపారు.వయోవృద్ధుల చట్టం లోని అంశాలను వివరించారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర కార్యదర్శి,జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు పి.హన్మంత్ రెడ్డి, ,మెట్ పల్లి డివిజన్ అధ్యక్షుడు ఒజ్జెల బుచ్చిరెడ్డి, మద్దెనపల్లి స్వామి,డివిజన్, మండలాల ,గ్రామాల సీనియర్ సిటిజెన్ల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.