సిరా న్యూస్;
ఇటీవల కన్నుమూసిన సిపిఎం ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ మాజీ సభ్యుడు సీతారాం ఏచూరీ పార్థివదేహానికి మాజీ కేంద్రమంత్రి వర్యులు విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) శనివారం ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లారు. పార్థివ దేహం పై పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సీతారాం ఏచూరితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. విద్యార్థి దశ నుంచే వామపక్ష భావాలను అలవర్చుకున్న ఆయన తుదిశ్వాస విడిచే వరకు ప్రజా పోరాటాల్లోనే బతికారన్నారు. తన జీవితాన్నే కాకుండా చివరకు తన దేహాన్ని సైతం ప్రజాసేవకే అంకితమిచ్చారని ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు అని అన్నారు.