కడియం నర్సరీ ప్రాంతానికి “చిరుత”

ఆలమూరు, మండపేట ప్రాతాల వాళ్లుకూడా అప్రమత్తంగా ఉండాలి
సిరా న్యూస్,రాజమహేంద్రవరం;
రాజమహేంద్రవరం దివానచెరువు అభయారణ్యం ప్రాంతంలో సంచరిస్తున్న చిరుత గత మూడు రోజులుగా జాడ లేకపోవడం తెలిసింది. అయితే మంగళవారం రాత్రి కడియం నర్సరీ ప్రాంతాల్లో చిరుత జాడ కనిపించిందని అడవి శాఖ అధికారులు ధ్రువీకరించారు. దాంతో ఈ ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దివానచెరువు ప్రాంతం నుంచి ఈ చిరుత కడియం ప్రాంతానికి వచ్చినట్లు కాలి ముద్రల ద్వారా అధికారులు నిర్ధారించారు. అయితే కడియం- వీరవరం రోడ్ మధ్యలో ఉండే దోషాలమ్మ కాలనీలో ఈ చిరుత జాడలు కనిపించడంతో ఆ కాలనీ వాసులంతా తీవ్ర భయాందోళన చెందారు. అడవి శాఖ అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి చిరుత జాడల ఉన్నట్లు గుర్తించారు.అది అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేది అంతుపట్టడం లేదు.కొన్ని నర్సరీలలో సీసీ కెమెరాలు ఉంటాయి. కాని ఇప్పుడు అందరూ భయపడి రైతులు ఎవరు నర్సరీలో ఉండడం లేదు. దీంతో చిరుత ఆ ప్రాంతంలోనే ఉందా అక్కడి నుంచి సమీపమైన ఆలమూరు లేదా మండపేట మండలాల పరిధిలోకి వెళ్ళిందా అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. గంటకు సుమారు 100 కిలోమీటర్ల వేగంతో పయనించే ఈ చిరుత ఎప్పుడు ఎక్కడికైనా వెళ్లగలగే అవకాశం ఉంటుంది. ఏదేమైనాప్పటికీ ఈ ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అడవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.ఎవరూ బయటకు రావద్దని,ఇంటి బయట లైట్లు వేసి ఉంచాలని,దగ్గరగా ఉండే మైకులు పలుకుతూ ఉండాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *