సిరా న్యూస్,రంగారెడ్డి;
శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆవరణలో ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరా లో చిరుత సంచారహిస్తున్న చిత్రాలు రికార్డయ్యాయి. మూడు రోజులుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాంతంలో చిరుత కోసం గాలింపు చేస్తున్నారు. చిరుత జాడ కోసం ఫారెస్ట్ అధికారులు 25 కెమెరాలు, ఐదు బోన్లు ఏర్పాటు చేశారు . ఓ బోన్ ముందు చిరుత సంచరిస్తున్న ఫోటోలు లభ్యం అయింది. గొల్లపల్లి, రషీద్ గూడ, బహదూర్ గూడ,
చిన్న గోల్కొండ ఎయిర్ పోర్ట్ చుట్టుపక్కల ప్రాంతాల రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ప్రజలు ఉదయం, రాత్రి, వేళల్లో ఒంటరిగా రోడ్డుపైకి వెళ్లవద్దని ఫారెస్ట్ అధికారుల విజ్ఞప్తి చేసారు.