సిరా న్యూస్,శ్రీశైలం;
నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలోని తెలుగు యూనివర్సిటీ వద్ద గల ప్రహరీ గోడపై చిరుత పులి సంచరించడం స్థానికంగా కలవరపెడుతుంది. ఈరోజు సాయంత్రం 6 గంటల సమయంలో రుద్రపార్కు సమీపంలోని ప్రహరీ గోడపై చిరుతపులి నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అక్కడే ఉన్న కొందరు చిరుతపులి సంచారాన్ని వారి సెల్ ఫోన్ లో వీడియో దృశ్యాలను చిత్రీకరించారు సాయంత్రం సమయంలోనే చిరుతపులి జన సంచారంలోకి రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తరచూ పలుమార్లు ఇదే పరిసర ప్రాంతాల్లోనే చిరుత పులి సంచారాన్ని తాము చూసామంటూ స్థానికులు చెబుతున్నారు అయితే ఈవిషయంపై అటవీశాఖ అధికారులు,దేవస్థానం అధికారులు చిరుత పులి తిరుగుతున్న ప్రదేశాల్లో రాత్రి సమయాల్లో స్థానికులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు.మరోపక్క అటవీ ప్రాంతం దగ్గరలోనే ఉండడంతో చిరుత పులులు పలుమార్లు సంచరించడం పరిపాటిగా మారింది…