-పిఆర్టియు టీఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రు సురేష్
సిరా న్యూస్,మంథని;
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిఆర్టియు టీఎస్ అధికారిక అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి ని గెలిపించాలని పిఆర్టియు టీఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రు సురేష్ ఉపాధ్యాయులను కోరారు. సోమవారం మంథని పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని పిఆర్టియు టీఎస్ పెద్దపల్లి జిల్లా శాఖ అధ్యక్షులు కర్రు సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్బంగా కర్రు సురేష్ మాట్లడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హత గల అందరు ఉపాధ్యాయులు ఓటరు నమోదు చేసుకోవాలని ,53 ఏళ్లుగా ఉపాధ్యాయులకు అనేక జిఓ లు తెచ్చి ఉపాధ్యాయుల జీవన ప్రమాణాలు పెంచడమే కాకుండా ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్న పిఆర్టియు టీఎస్ అధికారిక అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి ని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు టీఎస్ మంథని మండల అధ్యక్షులు దొంతుల కుమార్, ఉపాధ్యక్షులు ఉమా మహేష్, జిల్లా నాయకులు కృష్ణారెడ్డి ,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుమలత, ఉపాధ్యాయులు పరంజ్యోతి ,వరలక్ష్మి, మాధవి, భరత్ రెడ్డి, శేషాద్రి ,శ్రీకాంత్, విజయ్ కుమార్ ,కేశవులు పాల్గొన్నారు.