సిరా న్యూస్,కోరుట్ల,;
మనమందరము సమానమేనని భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను మనమందరం కొనసాగించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. బుధవారం పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ 67వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు..
ఆనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహానుభావులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే నేడు ప్రతి ఒక్కరం ఓటు హక్కును కలిగి ఉన్నామని తెలిపారు. ప్రజాస్వామ్య భారతదేశంలో ఓటుతో ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడం జరుగుతుందని ఏ దేశంలో కూడా ఈ విధానం లేదన్నారు. పేదవారైనా పెద్దవారైనా తమ ఓట్లను వేసి సరియైన వ్యక్తిని ఎన్నుకోనే విధంగా రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచిన ఆర్టికల్ ద్వారానే తాను ఎమ్మెల్యేను అయ్యనానని అన్నారు. మనకు కులాలు లేవని అందరము సమానమైన అని అందరం కలిసికట్టుగా కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుదామని పిలుపు నిచ్చారు.తాను ఒక్కడినే ఎమ్మెల్యేను కాదని నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేలను ఆయన అభిప్రాయాన్ని తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాల కోసం తాను కృషి చేస్తానని , యువత ఉపాధి కోసం, విద్యార్థుల విద్య కోసం, సామాన్యుల అభివృద్ధి కోసం నిరంతరం పాటు పడతానని హామీ ఇచ్చారు .కొందరు కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అలాంటి వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు.ఆనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ని ఘనంగా సన్మానించారు. ఈ వర్ధంతి వేడుకల్లో మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్,వైస్ చైర్మన్ గడ్డమీది పవన్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అన్నం అనిల్,కౌన్సిలర్లు మోర్తాడు లక్ష్మీనారాయణ,బలిజ పద్మ -రాజారెడ్డి, బద్ది సుజాత మురళి, గంధం గంగాధర్, పేర్ల సత్యం, గుండోజి శ్రీనివాస్, జిందం లక్ష్మీనారాయణ, అన్వర్, సజ్జు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ కమిటీ అధ్యక్షుడు ఉయ్యాల నరసయ్య, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం డివిజన్ అధ్యక్షుడు ఉయ్యాల శోభన్, నాయకులు పుప్పాల ప్రభాకర్, ఆడెపు మధు,బాబా,రహీం,రౌవుఫ్ఇమ్రాన్, టీవీ శేఖర్, మురళి,అంబేద్కర్ మాల, మాదిగ యువజన సంఘాల అధ్యక్షులు కంబ ఆనంద్, బలంతుల సురేష్, మున్సిపల్ అధికారులు, బి ఆర్ఎస్ నాయకులు, యూత్ నాయకులు , వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.