సిరా న్యూస్,కొలిమిగుండ్ల;
మొక్కలు నాటి చేతులు దులుపుకోవద్దని,వాటిని నిరంతరం సంరక్షించే బాధ్యత తీసుకోవాలని, మొక్కలకు మీ అమ్మ పేరు తగిలించి.. పెంచాలని రాంకో సిమెంట్స్ కొలిమిగుండ్ల యూనిట్ హెడ్ నాగరాజు అన్నారు. రాంకో మాతృవనం కార్యక్రమంలో భాగంగారాంకో ఉద్యోగులు 500 మొక్కలు నాటారు. పరిశ్రమలో పనిచేసే ప్రతి ఉద్యోగికి ఒక మొక్క బాధ్యత అప్పగించారు. ఎవరు నాటిన మొక్కకి వారి అమ్మపేరు పెట్టుకున్నారు. మొక్కలను సంరక్షిస్తామని అక్కడే ప్రతిజ్ఞ చేశారు. ‘ ఎక్ పేడ్ మా కె నామ్’ అని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు సుమారు 500 మొక్కలు నాటామని అడ్మిన్ హెడ్ రామరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ జిఎం రవికుమార్, హార్టికల్చర్ జిఎం ఈశ్వరన్, తదితరులు పాల్గొన్నారు.